NTV Telugu Site icon

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?

Janhvi Kapoor Boyfriend

Janhvi Kapoor Boyfriend

Janhvi Kapoor Again Caught With Boyfriend Shikhar Pahariya: బాలీవుడ్‌కి చెందిన సినీ తారలు తమ కెరీర్ పరంగా కన్నా.. వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. అందునా.. డేటింగ్ వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి. అఫీషియల్‌గా తమ రిలేషన్‌షిప్‌పై నోరు మెదపరు కానీ.. వెకేషన్లకు, పార్టీలకు మాత్రం బాగా చక్కర్లు కొడుతుంటారు. మీడియాకి చిక్కకుండా సీక్రెట్‌గా తమ తతంగాల్ని కొనసాగించాలని ప్రయత్నిస్తారు. కానీ.. సెలెబ్రిటీలకు మీడియా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక సమయంలో అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అలాగే బుక్కైపోయింది. గతంలోనూ ఓసారి తన ప్రియుడితో కలిసి దొరికిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కెమెరాకి చిక్కింది.

Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం

ఇంతకీ.. జాన్వీ ప్రియుడు ఎవరో తెలుసా? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా. రాజకీయ నేపథ్యం కలిగి ఉండటంతో పాటు చూడ్డానికి చాలా బాగుంటాడు కాబట్టి.. జాన్వీ అతని ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. గతంలో ఓసారి వీళ్లు కారులో షికారు చేస్తూ.. మీడియాకు దొరికారు. అప్పుడే వీరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే.. ఆ ఇద్దరు మాత్రం ఈ ప్రచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు వీళ్లిద్దరు ముంబైలోని కలినా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ఇద్దరూ వైట్‌డ్రెస్‌లో ట్విన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చాక వీళ్లిద్దరు తెలివి ప్రదర్శించారు. జంటగా కనిపిస్తే హంగామా అవుతుందని భావించి.. వేర్వేరుగా బయటకొచ్చి, వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి.. అధికారికంగా ప్రకటించకపోయినా, వీళ్లు ప్రేమలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

Variety Thief : వేసిన తాళం వేసినట్లే ఉంది.. రూ.13వేలు పోయాయి.. ఎలుకపైనే అనుమానం

కాగా.. బాలీవుడ్‌లో జాన్వీకి చెప్పుకోదగ్గ విజయాలు పడలేదు కానీ, కెరీర్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాఫీగానే సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్నా.. ఛాన్సులు మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు జూ.ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్30 సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకవేళ ఈ సినిమాతో జాన్వీ ఆకట్టుకుంటే మాత్రం.. ఆమె కెరీర్ మలుపు తిరగడం ఖాయం. తన తల్లి శ్రీదేవి రేంజ్‌లో కాకపోయినా.. వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవ్వొచ్చు.

Show comments