Jangaa: రా అండ్ రస్టిక్ లుక్‌తో షాక్ ఇచ్చిన హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న యంగ్ హీరో త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగా’ ప్రేక్షకులకు సరికొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ క్యారెక్టర్లలో కనిపించిన త్రిగుణ్ ఈ మోషన్ పోస్టర్లో మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.
విడుదలైన ‘జంగా’ మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. ఇందులోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరియు సౌండింగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. త్రిగుణ్ తన కెరీర్లోనే ఫస్ట్ టైమ్ ఒక ‘రా అండ్ రస్టిక్’ లుక్‌లో, ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఆయన కెరీర్లోనే ఇది అత్యంత వైవిధ్యమైన, వైల్డ్ సబ్జెక్ట్ అని మోషన్ పోస్టర్ కట్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ చివరి దశకు చేరుకుంది. ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీమతి వనిత కిలారి సమర్పణలో రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెవిన్ గడ్డం (శ్రీహరి) కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ హీరోయిన్గా నటిస్తుండగా.. పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. వీరితో పాటు శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగ మహేష్, భూపాల్ రాజు, రఘు కారుమంచి, రచ్చ రవి లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు