మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం జానకి వర్సెస్ కేరళ టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదం చివరకు ముగిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనలతో మేకర్స్ టైటిల్ మార్చేందుకు అంగీకరించారు. ‘జానకి వర్సెస్ కేరళ’ అనే టైటిల్ రాష్ట్రాన్ని లక్ష్యం చేస్తుందని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో CBFC జోక్యం చేసుకుని టైటిల్ మార్పును సూచించగా, దాన్ని నిర్మాతలు ఆమోదించారు. దీంతో సినిమా కొత్త టైటిల్‌గా ‘జానకి Vs స్టేట్ ఆఫ్ కేరళ’ ను ఫిక్స్ చేశారు.
Also Read : Anshu : బ్లాక్ బికినీలో షాక్ ఇచ్చిన.. మన్మథుడు బ్యూటీ అన్షు
ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో కథానాయిక జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) పై జరిగే లైంగిక దాడి, ఆ తర్వాత ఆమె న్యాయానికి కోసం చేసే పోరాటం ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఇది సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ, చట్ట వ్యవస్థపైనా ఓ బలమైన సందేశం ఇస్తుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సురేష్ గోపి, బైజు సంతోష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. ఫణీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.