Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2: బాక్సాఫీస్ దగ్గర ‘తలైవా’ సునామీ సృష్టిస్తున్నారు. వయసుతో పనేలేదని, వెండితెరపై తన మేనియా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఒక తమిళ హీరో సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరుస్తోంది. చాలామంది డబ్బింగ్ హీరోల సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ రజనీకాంత్ వస్తే ఆ వైబ్రేషనే వేరు. తెలుగు ఆడియన్స్ ఆయన్ను ఎంతగా సొంతం చేసుకున్నారో ‘జైలర్ 2’ వసూళ్లు మరోసారి కళ్లకు కట్టాయి. మొదటి రోజే వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దద్దరిల్లిపోయాయి.
ఈ వంద కోట్ల మార్క్‌తో రజనీకాంత్ సౌత్ ఇండియాలోనే అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే నాలుగు సార్లు రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఏకైక తమిళ హీరోగా రికార్డులకెక్కారు. ఇతర భాషా స్టార్లకు తెలుగులో ఒకట్రెండు సినిమాలు ఆడటం చూశాం.. కానీ నాలుగు సార్లు సెంచరీ కొట్టడం ఒక్క రజనీకాంత్‌కే చెల్లిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్క్రీన్‌పై రజినీ స్వాగ్, నెల్సన్ స్టైలిష్ మాస్ టేకింగ్, థియేటర్లలో ఈలలు వేయించే యాక్షన్ సీన్స్ తెలుగు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. బాక్సాఫీస్ దగ్గర రజినీ ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతుండటంతో ఫుల్ రన్లో ‘జైలర్ 2’ మరిన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
Also Read
- Srinidhi Shetty : రూట్ మార్చిన 'ఆదర్శ కుటుంబం'.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
- Rashmika Mandanna : "అవును.. అతనంటే నాకు పిచ్చి!" : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- God of War: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
తాజావార్తలు
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
-
Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
-
Srinidhi Shetty : రూట్ మార్చిన ‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!