‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో, సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన చిత్రం ‘జాక్’. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి వరుస హిట్స్ తర్వాత సిద్ధూ నటించిన ఈ మూవీ, ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా ఊహించని విద్ధంగా ఫ్లాప్ అయ్యింది. నైజాం తో పాటు కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు చాలా లాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్మాతను ఆదుకోవడానికి హీరో ముందుకు వచ్చారు.
Also Read :Ritu Varma : ఇలాంటి కథలో నటించడం నా అదృష్టం..
‘జాక్’ సినిమాకు గాను సిద్దు జొన్నలగడ్డ ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం అందుకోగా, తాజా సమాచారం ప్రకారం తన పారితోషికం నుంచి సగం, అంటే 4 కోట్ల రూపాయలు నిర్మాతకు తిరిగి ఇచ్చి, తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ చర్య సినీ పరిశ్రమలో అరుదైన, ఆదర్శనీయమైన ఉదాహరణగా నిలిచింది. సిద్దు ఈ విధమైన బాధ్యతాయుతమైన, నీతిగల నిర్ణయంపై.. నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి, అతని మంచితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో సిద్దు గురించి ప్రశంసలు కురుస్తున్నాయి. ‘సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే, సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది’ అని అభిమానులు, విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చర్య సిద్దు జొన్నలగడ్డను కేవలం ఒక నటుడిగా కాక, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిపింది.