హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
Also Read : Vikram : ఆగిపోయిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్..
నిర్మాతలతో పాటు టాలీవుడ్ కు చెందిన పలు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి ఇళ్లలో కూడా ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు కు చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిపై కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. నిర్మాత నెక్కింటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీకి చేసిన అధినేత ఇంట్లో అలాగే ఆఫీసులో రైడ్స్ జరిపారు అధికారులు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ బడ్జెట్ నిర్మాతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అలాగే పుష్ప -2 నిర్మాత ఇళ్లలోను సోదాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ సోదాలు జరగనున్నట్టు తెలుస్తోంది. నిన్న చేపట్టిన తనిఖీల్లో భాగంగా పుష్ప -2 మేకర్స్ కు చెందిన పలు కీలక విషయాలను కనుగొన్నారు ఐటి అధికారులు. పుష్ప -2 మేకర్స్ ను విచారించిన అధికారులు పుష్ప 2 వరల్డ్ వైడ్ గా సాధించిన వసూళ్లకు తగ్గట్లుగా నిర్మాతలు ఐటీ చెల్లింపులు జరగలేదని కనుగొన్నారని సమాచారం.