Monalisa Kumbh: బాలీవుడ్ సినిమా సైన్ చేసిన తేనెకళ్ల మోనాలిసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధంగా మారింది. మంచికైనా చెడుకైనా క్షణాల్లో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా జనాన్ని ఓవర్ నైట్ పాపులర్ చేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒకటి వైరల్ అవుతుంది, తద్వారా ఎవరో ఒకరు ఫేమ్ సంపాదిస్తూ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో కూడా అనేక దృశ్యాలు కనిపించాయి. వేర్వేరు వ్యక్తులు వివిధ కారణాల వలన మహాకుంభ్‌లో పాపులర్ అయ్యారు. పూసల దండలు అమ్మే మోనాలిసా అనే అమ్మాయి కూడా వార్తల్లో నిలిచింది. ఈ అమ్మాయి తన తేనె కళ్లతో, అమాయకంగా కనిపించడంతో ఆమెకు ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేసింది. అనతికాలంలోనే ఆమె సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. ఆమె కళ్ల అందంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇక తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తన చిత్రంలో మోనాలిసాను తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం
Also Read
తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లి.. తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. మణిపూర్‌లో జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోనాలిసా కీలక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు మనోజ్ మిశ్రా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్‌లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి తన తదుపరి చిత్రానికి ఆమెను ఎంపిక చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో కూడా బయటకు వచ్చింది. మోనాలిసా ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాతో చెప్పింది. అతను మోనాలిసా కుటుంబాన్ని కలిశాడని తెలిపిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆయన మాట్లాడుతూ- సినిమాలో మోనాలిసాను బాగా ప్రెజెంట్ చేస్తాను. నేను తన భవిష్యత్తును సినిమాల్లో చూపించాలనుకుంటున్నాను. నేను ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిశాను, అందరూ చాలా అమాయకులు. మోనాలిసా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఇంకా చిన్నపిల్ల, ఆమెను సిద్ధం చేయడం మన బాధ్యత అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!