Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్ రికార్డ్’ను కూడా అంతే బలంగా నమ్ముతున్నాడు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావుల కాలం నాటి దర్శకుడి బ్రాండ్ ఇమేజ్ను నేటితరం దిగ్గజాలు సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
దర్శకుడి బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు ఎస్.ఎస్. రాజమౌళి. కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని ఆయన, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో హీరోల మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయికి పెంచారు. ఇప్పుడు మహేష్ బాబుతో రాబోతున్న తదుపరి ప్రాజెక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరగడానికి కారణం ‘రాజమౌళి విజన్’ అనే నమ్మకమే. మరోవైపు సుకుమార్, తన క్లిష్టమైన స్క్రీన్ ప్లే మరియు విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో టాలీవుడ్లో బలమైన ముద్ర వేశారు. రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ను సరికొత్తగా చూపించి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇక ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్‌తో తీయబోయే ‘స్పిరిట్’ సినిమాతో దర్శకుడే ఒక పెద్ద బ్రాండ్ అని నిరూపిస్తున్నారు.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
‘కల్కి 2898 ఏడీ’తో ఇండియన్ సినిమాకు గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ వరల్డ్ పరిచయం చేసిన నాగశ్విన్, భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ తన మేకింగ్ స్టైల్‌తోనే ఆడియన్స్‌ను కట్టిపడేశారు. అలాగే కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఎదిగారు. కోలీవుడ్ నుంచి అట్లీ, లోకేష్ కనకరాజ్ లాంటి యువ దర్శకులు స్టార్ హీరోల ఇమేజ్ను వాడుకుంటూనే తమకంటూ ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసించిన శంకర్ లాంటి సీనియర్లు ప్రస్తుతం తమ పాత మ్యాజిక్‌ను నిరూపించుకోవాల్సిన పోటీ వాతావరణం నెలకొంది.
ఇటు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, అయాన్ ముఖర్జీలతో పాటు ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ లాంటి దర్శకులు హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ రాబడుతున్నారు. భన్సాలీ నిర్మిస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రం కోసం రణబీర్, అలియా, విక్కీ కౌశల్ లాంటి స్టార్లు ఒకే ఫ్రేమ్‌లోకి రావడం ఆయన బ్రాండ్ పవర్‌కు నిదర్శనం. హీరో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురాగలడేమో కానీ, సీట్లో కూర్చోబెట్టి మెప్పించేది మాత్రం దర్శకుడి కథ, కధనాలే. నేటి సినీ పరిశ్రమలో కేవలం హీరోనో, దర్శకుడో మాత్రమే కాదు.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌కు బలమైన స్క్రీన్ ప్లే తోడైనప్పుడే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది.
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!