Site icon NTV Telugu

Indian 3 : ఇండియన్ 3కి ఏమైంది?

Indian 3

Indian 3

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది.

Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?

అయితే, ఇండియన్ 2 డిజాస్టర్ కావడం, ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ కూడా డిజాస్టర్ కావడంతో, ఇప్పుడు ఇండియన్ 3పై ఆ ప్రభావం పడుతోంది. నిజానికి, ఇండియన్ 3 షూటింగ్ అంతా పూర్తయింది, ఇంకా కొద్దిగా టచ్-అప్ చేయాల్సి ఉంది. అయితే, ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్ ఫలితాల కారణంగా శంకర్‌కు బడ్జెట్ ఇవ్వడానికి లైకా సంస్థ ఏమాత్రం సిద్ధంగా లేదు.

Also Read : Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ఇంకా సిద్ధం కాలేదు. నిజానికి, ఈ సినిమా కోసం శంకర్‌తో సహా కమల్ హాసన్‌కు ఇప్పటికే నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇచ్చేశారు. కానీ, సినిమా బిజినెస్ మాత్రం జరగడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఈ సినిమా తీసుకోలేమని ఓటీటీ సంస్థ కూడా డీల్ నుంచి బయటకు వచ్చేసింది. మొత్తం మీద, ఇండియన్ 3 సినిమాపై భారీగా ప్రభావం పడింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదని చెప్పాలి.

Exit mobile version