Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 3 Movie : కోలీవుడ్ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్, క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఇండియన్ 3’ మరోసారి వార్తల్లో నిలిచింది. 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు మూడో భాగం విడుదలపై సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇక ఇప్పటికే ‘ఇండియన్ 2’ షూటింగ్ సమయంలోనే ‘ఇండియన్ 3’కి సంబంధించిన దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు, ప్యాచ్‌వర్క్, అదనపు షూటింగ్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన షూటింగ్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తిచేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా కమల్ హాసన్ అందుబాటులో ఉండే తేదీల కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
ఈ సినిమాలో కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్. అంతేకాదు, వీరశేఖరన్ బాలరామ్ అనే స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలోనూ కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ఎస్.జె. సూర్య, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఇండియన్ 3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ముందు అనుకున్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాతో కమల్ హాసన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
-
Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
AP Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి పెట్టుబడుల జాతర.. పలు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
-
Nagarjuna : డ్రగ్స్ రహిత భారత్‌కు హీరో నాగార్జున మద్దతు
ట్రెండింగ్
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!