Surya : నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. అందరి హీరోల గా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Chhava : తెలుగులో విడుదలకు అడ్డంకులు ఎదుర్కొంటున్న ‘ఛావా’..!
Also Read
కాగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. మే 1న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డెట్ ఎంతో ఆకట్టుకోగా టీజర్‌తో అందరి దృష్టిని మరింత ఆకర్షించింది. దీంతో ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ‘రెట్రో’ ఒకటిగా నిలిచింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఈ మూవీ గురించి తన అనుభవాలను పంచుకున్నాడు.. ‘చెన్నైలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ‘రెట్రో’ మూవీ కోసం పెద్ద జైలు సెట్ ఏర్పాటు చేశారు. లైబ్రరీ, వంటగది అన్నిటినీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో ఐదు రోజులు ఓ పాట చిత్రీకరించారు. ఆ ఐదు రోజులు నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది. ఆ పాటలో డాన్స్ మూమెంట్స్ కూడా బాగుంటాయి, టోటల్ గా మూవీలో అన్ని భావోద్వేగాల ఉంటాయి’ అని సూర్య తెలిపారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!