Site icon NTV Telugu

Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి ‘ఏస్’

Ace

Ace

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమా అంటే ఆకర్షణీయమైన కథాంశం, భావోద్వేగపూరిత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏస్’. 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది.

Also Read:Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!

శ్రీమతి పద్మ సమర్పణలో, శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ‘ఏస్’ సినిమా హక్కుల కోసం పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీపడినప్పటికీ, శ్రీ పద్మిణి సినిమాస్ ఆకర్షణీయమైన ఒప్పందంతో ఈ హక్కులను దక్కించుకుంది. బి. శివ ప్రసాద్ గతంలో దర్శకుడిగా, నిర్మాతగా ‘రా రాజా’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘ఏస్’ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో మే 23న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా, సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు.

Exit mobile version