బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ “క్రిష్”లో నాలుగవ పార్ట్ తెరకెక్కనుందని ఇటీవల ప్రకటించి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హృతిక్ రోషన్. సూపర్ హీరో ఫ్రాంచైజ్ క్రిష్ విడుదలై 15 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ ఈ ప్రకటనతో తన అభిమానులందరినీ ఆశ్చర్యపరిచేలా సోషల్ మీడియాలో “గతం పూర్తయింది. భవిష్యత్తు ఏమి తెస్తుందో చూద్దాం. # 15YearsOfKrrish # Krrish4” అంటూ రాసుకొచ్చాడు. దీంతో గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ‘క్రిష్-4″ గురించి పలు ఆసక్తికరమైన కథలను, సృజనాత్మక ఆలోచనలను వెల్లడిస్తున్నారు నెటిజన్లు. ‘క్రిష్-3” 2013లో విడుదలైంది. దాదాపు దశాబ్దం తరువాత మరో సీక్వెల్ ను ప్రకటించడం దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. తాజాగా ఓ నెటిజన్ తాను 5 నిమిషాల్లోనే “క్రిష్-4” కథను రాశానని, రాకేష్ రోషన్ కూడా ఇంత ఫాస్ట్ గా రాయలేరంటూ పోస్ట్ చేశాడు.
Read Also : ‘రాక్షసన్’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్
అందులో “కృష్ణపై రివెంజ్ తీర్చుకోవడానికి నసీరుద్దీన్ షా పాస్ట్ నుంచి 2022కు వస్తాడు (అతను ‘కోయి మిల్ గయా’ రోజులకు తిరిగి వెళ్లి గ్రహాంతరవాసులను బంధిస్తాడు. ఇప్పుడు సూపర్ విలన్ గా తిరిగొస్తాడు). టైం మిషన్ ద్వారా తిరిగొచ్చిన విలన్ కృష్ణ, ప్రియాల కొడుకుని తీసుకుని తిరిగి 2006 కాలానికి వెళతాడు. దీంతో కృష్ణ తన కొడుకుని కాపాడుకోవడం కోసం మళ్ళీ టైం మెషీన్ ను సృష్టించి దాని ద్వారా 2006కు వెళ్తాడు. కొన్ని ఫైట్ సీక్వెన్స్ తరువాత నషీరుద్దీన్ షా కృష్ణను బంధిస్తాడు. 2006లో హెల్ప్ లెస్ గా ఉన్న ప్రియాకు ఏలియన్ జాదూ సూపర్ పవర్స్ ఇస్తాడు. అప్పుడు ప్రియా వెళ్లి విలన్స్ తో పోరాడి కృష్ణను, తన కొడుకుని విడిపిస్తుంది. తరువాత జాదూ సహాయంతో వారంతా కలిసి నసీరుద్దీన్ షా రాజ్యాన్ని, అతని టైం మెషీన్ ను నాశనం చేశారు” అంటూ పోస్ట్ చేశాడు. దీనిని షేర్ చేసుకున్న హృతిక్ రోషన్ “ఇమాజినేషన్ 100%” అంటూ చమత్కరించారు.