Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Gouri Priya: ఒక భాషలో పుట్టి పెరిగిన నటి మరో భాషా సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అక్కడి ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావించే స్థాయికి చేరుకోవడం మాత్రం అంత సులభం కాదు. భాష తెలియని చోట నటనతో మెప్పించాలి.. పలకరింపులో స్థానికత తీసుకురావాలి.. అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ అలాంటి ప్రయాణంతోనే కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు తమిళ సినిమాలను డబ్బింగ్ వెర్షన్లలో చూసిన ఆమె.. ఇప్పుడు అదే తమిళ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో పెరిగిన శ్రీ గౌరీ ప్రియ ప్రయాణం మోడలింగ్‌తో మొదలైంది. 2018లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆమెకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘మ్యాడ్’లో కాలేజీ అమ్మాయి పాత్ర యూత్ లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా నటనతో మెప్పించే నటిగా ఆమెకు పేరు రావడం మొదలైంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే గౌరీ ప్రియకు ప్రత్యేకమైన గుర్తింపు తమిళ సినిమా ‘లవర్’తో వచ్చింది. మణికందన్ సరసన నటించిన ఈ మూవీలో దివ్య పాత్రలో ఆమె చూపించిన నటన తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ, తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి చెందిన నటిగానే ప్రేక్షకులకు అనిపించడం ఆమె సామర్థ్యానికి నిదర్శనంగా మారింది. తమిళ సినిమాతో గౌరీ ప్రియకు ఉన్న అనుబంధం మాత్రం అప్పటితో మొదలైనది కాదు. చిన్నతనంలోనే తమిళ సినిమాలు ఆమె జీవితంలోకి వచ్చాయి. అప్పట్లో తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి విస్తృతంగా విడుదలయ్యేవి. తన చిన్ననాటి ఇష్టమైన సినిమాల్లో చాలా వరకు తమిళ డబ్బింగ్ చిత్రాలేనని ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్యూలో కూడా తెలిపారు.
తమిళ భాషతో ఆమెకు ఏర్పడిన అనుబంధం కూడా ఆసక్తికరంగానే సాగింది. చిన్నతనంలో తమిళ పాటలను తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో వింటూ, పాడుతూ పెరిగిన గౌరీ.. ఆ పాటల అసలు అర్థం తెలుసుకోవాలనే ఆసక్తితో ఒరిజినల్ తమిళ పాటలను వినడం మొదలుపెట్టారు. ఇలా పాటలతో మొదలైన పరిచయం క్రమంగా భాషపై ఆసక్తిగా మారింది. కరోనా మహమ్మారి సమయంలో ఆమె తమిళ సినిమాలను ఒరిజినల్ భాషలో చూడటం మరింత పెంచుకున్నారు. దాంతో తమిళ భాష, సినిమా, సంస్కృతికి ఆమె మరింత దగ్గరయ్యారు.
మొదటిసారి తమిళ సినిమా అవకాశం వచ్చినప్పుడు ఆ భాషను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, సినిమాలు చేస్తూ క్రమంగా నేర్చుకున్నారు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు తనను ఎంతో ఆప్యాయంగా ఆదరించడం, పలకరించడం తనకు ప్రత్యేక అనుభూతి ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. చాలామంది తెలుగువారు తాను టాలీవుడ్లోకి వచ్చిన తమిళ అమ్మాయిని అనుకుంటారని, కానీ నిజానికి తాను తమిళంలో కొంత రాణించిన ఒక తెలుగు అమ్మాయిని మాత్రమేనని ఆమె చెప్పిన మాట ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక 2026లో రీసెంట్ గా రిలీజ్ అయిన ‘చెన్నై లవ్ స్టోరీ’తో గౌరీ ప్రియ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే కాదు, తమిళ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యారు. తెలుగు అమ్మాయిగా మొదలైన ఆమె ప్రయాణం తమిళ ప్రేక్షకుల మధ్య కూడా బలమైన స్థానాన్ని సంపాదించే దిశగా సాగుతోంది. ఇక ఆమె తదుపరి తమిళ ప్రాజెక్ట్ ‘బ్రో క్లబ్’. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎస్.జే. సూర్య, అర్జున్ అశోకన్, శ్రద్ధా శ్రీనాథ్, మాలవిక మనోజ్ తదితరులు నటిస్తున్నారు. ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైన శ్రీ గౌరీ ప్రియ.. ‘బ్రో క్లబ్’తో తన క్రేజ్‌ను ఇంకెంత పెంచుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఆమె Mad2 లో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. మరిన్ని అప్ డేట్స్ మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఒక తెలుగమ్మాయి తమిళ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకోవడం అంటే తెలుగు వాళ్ళకు గర్వకారణమే కదా.
- Tags
- cinema
- Sri Gouri Priya
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!