బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమియా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఇండియన్ ఐడల్ జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అక్కడితో ఆగిపోవటం లేదు బీ-టౌన్ బిగ్ మ్యూజీషియన్. తన స్వంత లేబుల్ తో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరంలో రెండు విడుదలయ్యాయి. ‘ఆప్ కా సూరూర్ 2021, మూడ్స్ విత్ మెలోడిస్’ సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ హిమేశ్ తాజా ఆల్బమ్స్ దూసుకుపోతున్నాయి.
రెండు సక్సెస్ ఫుల్ ఆల్బమ్స్ తరువాత మరో దానితో ఎంటర్టైన్ చేస్తానంటున్నాడు హిమేశ్. ఈసారి ‘హిమేశ్ కే దిల్ సే’ అంటూ టైటిల్ అనౌన్స్ చేశాడు. ఇప్పటికే ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్స్ అయిన అరుణిత, పవన్ దీప్ లకు ఆయన ప్లే బ్యాక్ సింగింగ్ లో బిగ్ బ్రేక్ ఇచ్చాడు. లెటెస్ట్ రిలీజ్ కానున్న ‘హిమేశ్ కే దిల్ సే’ ఆల్బమ్ లో సవాయి భట్ అద్భుతమైన మెలోడీ నంబర్ ఒకటి పాడబోతున్నాడట. సవాయి భట్ ఆ మధ్య ఇండియన్ ఐడల్ సీజన్ 12 నుంచీ ఎవిక్ట్ అయ్యాడు. అతడ్ని పోటీ నుంచీ తప్పించటం చాలా మందికి నచ్చలేదు. అమితాబ్ మనవరాలు నవ్య నవేలీ నందా కూడా తన సొషల్ మీడియా అకౌంట్లో సవాయి భట్ గురించి పోస్ట్ పెట్టింది. అంతగా దేశాన్ని ఆకర్షించిన సవాయి భట్ కు తాను ఖచ్చితంగా బ్రేక్ ఇస్తానని షోలో చెప్పాడు హిమేశ్.
అన్నమాట నిలబెట్టుకుని ‘హిమేశ్ కే దిల్ సే’ ఆల్బమ్ లో రేషమియా యంగ్ సింగర్ కి బ్రేక్ ఇచ్చాడు. చూడాలి మరి, సవాయి భట్ తొలి పాట ఎలాంటి స్పందన పొందుతుందో. ‘హిమేశ్ కే దిల్ సే’ ఆల్బమ్ విడుదల తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది…