బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమియా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఇండియన్ ఐడల్ జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అక్కడితో ఆగిపోవటం లేదు బీ-టౌన్ బిగ్ మ్యూజీషియన్. తన స్వంత లేబుల్ తో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరంలో రెండు విడుదలయ్యాయి. ‘ఆప్ కా సూరూర్ 2021, మూడ్స్ విత్ మెలోడిస్’ సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ హిమేశ్ తాజా ఆల్బమ్స్ దూసుకుపోతున్నాయి.…