NTV Telugu Site icon

Allu Arjun: రేవతి కుటుంబానికి క్షమాపణ.. శ్రీతేజని పరామర్శించనున్న అల్లు అర్జున్

Aa

Aa

Allu Arjun: మరోసారి మీడియా ముందుకు వచ్చారు హీరో అల్లు అర్జున్‌.. సంధ్య థియేటర్‌ ఘటనలో అరెస్ట్‌ అయి.. బెయిల్‌ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. ఈ రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ.. మొదట గీతాఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అర్జున్‌ను వరుసగా సినీ ప్రముఖులు వచ్చిన పరామర్శించారు..

Read Also: Jamili Elections: ఈనెల 16న లోక్‌సభ ముందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లు

ఆ తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చారు బన్నీ.. సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు.. ఈ సమయంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు బన్నీ.. నాకు మీరు అందించిన ప్రేమ అభిమానులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా.. నా అభిమానులకు రుణపడి ఉంటాను అన్నారు.. అయితే, సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్‌లో లేదన్నారు.. గత 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్‌లో సినిమా చూస్తున్నారు.. దాదాపు 30 సార్లు ఆ థియేటర్‌కు వెళ్లిఉంటానని గుర్తుచేసుకున్నారు.. కానీ, అది అనుకోకుండా జరిగింది.. రేవతి కుమారుడు శ్రీ తేజని స్వయంగా నేను వెళ్లి పరామర్శిస్తాను అన్నారు హీరో అల్లు అర్జున్‌..

Show comments