బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రాధే ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ 2009లో విడుదలైన సల్మాన్ ‘వాంటెడ్’ సీక్వెల్ లా అనిపిస్తుంది. కానీ ఇది 2017లో వచ్చిన కొరియన్ చిత్రం “ది అవుట్ లాస్” రీమేక్. ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ సాంగ్ ఉండగా… దిశా పటాని లుక్ కూడా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ట్రైలర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘డీజే’ సినిమాలోని ‘సీటిమార్’ సాంగ్ కు సల్మాన్ స్టెప్పులేయడం విశేషం. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టర్ గా, దిషా పటాని ఆయన కుమార్తెగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈద్ కానుకగా ‘రాధే’ 13 మే 2021న థియేటర్లలోకి, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఒకేసారి విడుదల కానుంది.