కోలివుడ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. చెప్పాలి అంటే ఈ మూవీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు యూత్ లో తిరుగులేని క్రేజ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. అని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల అంటే ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ బజ్ క్రియేట్ చేయగా. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
Also Read:Thandel: ‘తండేల్’ పై దర్శకేంద్రుడి రివ్యూ
అనుకున్నట్లుగానే ప్రదీప్ ఈ సారి కూడా ఈ ట్రైలర్‌ని ఆద్యంతం యూత్‌ఫుల్ కంటెంట్‌తో నింపేశాడు. కాలేజీ లైఫ్‌లో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. ప్రేమలో అతనికి ఎదురైన సమస్యలు, వాటి మూలంగా అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..అనే అంశాలతో ఈ చిత్రిని, నేటి తరం యువతకు హత్తుకునేలా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. ఇక ఈ మూవీలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ యాక్టింగ్ కూడా బాగుంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
https://youtu.be/qIBZlbJ7NUE?si=Kvfl8pCUMT4Ol6LM