Thandel: ‘తండేల్’ పై దర్శకేంద్రుడి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే చైతన్య, సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది నటీనటులు కూడా చై యాక్టింగ్ పై ‘తండేల్’ టీం పై ప్రశంసలు కురిపించగా.. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ కూడా ఈ మూవీ పై రివ్యూ ఇచ్చారు..
Also Read:Mrunal: గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే.. కె.రాఘవేంద్రరావు. ఆయన సినిమాల గురించి రివ్యూలు చాలా తక్కువగా చెబుతుంటారు. ఎంతో నచ్చితేనో, తన స్టైల్‌లో ఉంటేనో తప్ప ఆయన రివ్యూలు ఇవ్వరు. కానీ ఇప్పుడు ‘తండేల్’ సినిమాకు తన రివ్యూ ఇచ్చారు.. ‘చాలా రోజులకు ‘తండేల్’ వంటి అద్భుతమైన ప్రేమకథను చూశాను. నాగచైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందూ మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసంతో కూడుకుంది. షాట్ మేకింగ్ పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్ కు అభినందనలు’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక ఈ ట్వీట్ పై నాగచైతన్య సంతోషం వ్యక్తం చేస్తూ ‘థాంక్యూ సో మచ్ సర్ మీకు సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ మాటలు, అభినందనలు నాకెంతో అమూల్యమైనవి’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!