పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పిరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ మరియు ఎ ఎం జ్యోతికృష్ణ దర్శకులు. నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తోంది.
Also Read : HHVM : హరిహర వీరమల్లు ఇన్ సైడ్ టాక్.. ఏంటి భయ్యా ఇది
కాగా కొద్దిసేపటి క్రితం నైజాం ఏరియాలో రేపటి నుండి అన్ని షోస్ కు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఏపీలో ఇప్పటికి బుకింగ్స్ ఓపెన్ చేయగా సోల్డ్ అవుట్ అయ్యాయి. కానీ నైజాం లో పంపిణీదారులకు, ఎగ్జిబిటర్స్ కు మధ్య చిన్న తకరారు నడుస్తోంది. దాంతో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అయితే ఇప్పడు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్స్ కు సంబందించి బుకింగ్స్ ఓపెన్ చేసారు. కానీ ఇలా ఓపెన్ చేయడం అలా నిమిషాలలోనే టికెట్స్ బుక్ అవడం జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ సినిమా అందరి కంటే ముందే చూసేయాలని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టికెట్స్ హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. ఇప్పటివరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే వరల్డ్ వైడ్ గా రూ. 29.5 కోట్లు రాబట్టింది. ఇందులో కేవలం పాన్ ఇండియా వారీగా 4,388 షోస్ కు గాను రూ. 18.11 కోట్లతో 40.04% ఆక్యుపెన్సీ రాబట్టింది.