పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ వర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని వాస్తవానికి ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం అమావాస్య ఘడియలు మొదలవడం వల్ల నిన్న రాత్రి ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించి సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వినిపించింది. కొంతమంది బాగుందని అంటే, మరి కొంతమంది దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Kingdom : ఏపీలో కింగ్డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?
ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాకి 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ అని కూడా ప్రచారం చేశారు. సినిమా రిలీజ్ కాకముందు విఎఫ్ఎక్స్ అధికంగా ఉన్నాయని చెప్పడంతో అందుకు అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే వాస్తవానికి సినిమా చూసిన తర్వాత మాత్రం సినిమా బడ్జెట్ మీద అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే వీరు చెబుతున్న 300 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక నిజంగా కేటాయించి ఉంటే, విఎఫ్ఎక్స్ ఇంకా బాగా వచ్చి ఉండేవి.
Also Read: HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
సినిమాలో గ్రాఫిక్స్ గురించి ఎక్కువగా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. సాధారణ సినిమాల కంటే దారుణంగా ఈ గ్రాఫిక్స్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. వారు చెబుతున్న బడ్జెట్‌కి చూపిస్తున్న అవుట్‌పుట్‌కి ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. అయితే వాస్తవానికి విఎఫ్ఎక్స్లో అవుట్‌పుట్ తీసుకోవాలంటే దర్శకుడికి మంచి అనుభవం ఉండాలి. కానీ జ్యోతి కృష్ణ ట్రాక్ రికార్డు చూస్తే, ఆయన ఈ రేంజ్ అవుట్‌పుట్ అందుకోలేకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని అంటున్నారు. ఈ సినిమాకి ఎక్కువగా వినిపిస్తున్న నెగెటివ్ టాక్ ఆ గ్రాఫిక్స్ కారణంగానే అనడంలో ఎలాంటి సందేహం లేదు.