HHVM: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన *హరిహర వీరమల్లు* సినిమా ఎట్టకేలకు బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు కానీ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సంపాదించింది. అయితేనేం, ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. *హరిహర వీరమల్లు* అనే ఒక కల్పిత పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. ఫస్ట్ ఆఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయినా సరే, ఫస్ట్ డేతో పాటు ప్రీమియర్స్‌లో ఈ సినిమా గట్టిగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు సినిమా టీం అధికారికంగా ప్రకటించలేదు కానీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సుమారు 45 కోట్ల వరకు నెట్ ఈ సినిమా కలెక్ట్ చేసింది. చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన *భీమ్లా నాయక్* సినిమాకి మాత్రమే ఆ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమాకి కూడా కేవలం 40 కోట్ల వరకు నెట్ మాత్రమే రాగా, ఈ సినిమా మొదటి రోజు ప్రీమియర్‌లతో కలిపి 45 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ వీకెండ్ ఈ సినిమాకి మరింత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
HHVM: హరిహర డే 1.. పవన్ కెరీర్ హయ్యెస్ట్!
- హరిహర వీరమల్లు రికార్డ్ ఓపెనింగ్
- పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హైయెస్ట్ ₹45 కోట్ల నెట్ వసూళ్లు
- క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో భారీ వసూళ్ల దిశగా సినిమా!

Hari Hara