ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల ‘ఖలేజా’, ‘అందాల రాక్షసి’ సినిమాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి
అర్జున్, జగపతిబాబు, వేణుతో కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఆయనకు ఇది మొదటి సినిమా. ఆ తర్వాత తమిళంలో ‘జయం’, ‘తనై వరువన్’, తరువాత తెలుగులో ‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో లయ, స్నేహ, విజయలక్ష్మి కీలక పాత్రలలో నటించారు.
Also Read:The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ వంటి కమెడియన్స్ నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన రీ-రిలీజ్ చేస్తున్నట్టు సినిమా టీమ్ ప్రకటించింది. నిజానికి అప్పట్లో ఈ సినిమా కామెడీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలం పాటు టీవీలో కూడా ఈ కామెడీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది చూడాల్సి ఉంది.
