Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యువ సెన్సేషన్, ‘హను-మాన్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన మన సూపర్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కేవలం రెండు, మూడు సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఒక యువ హీరో ఎంగేజ్మెంట్కి ఏకంగా మెగాస్టార్ తో పాటు రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు క్యూ కట్టడం ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న ప్రముఖ హోటల్ ‘తాజ్ కృష్ణ’ వేదికగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో ప్రైవేట్ గా ఈ వేడుకను ప్లాన్ చేసినప్పటికీ.. వచ్చిన గెస్ట్ లతో ఆ ప్రాంతమంతా ఓ రేంజ్ లో కోలాహలంగా మారిపోయింది.
ముఖ్యంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచే తేజకు చిరంజీవితో ఉన్న ఆత్మీయ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన ముద్దుబిడ్డ లాంటి తేజ ఎంగేజ్మెంట్ కి చిరు స్వయంగా విచ్చేసి సందడి చేశారు. ఇక రాజకీయ ప్రముఖుల విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లాంటి అగ్రశ్రేణి నాయకులు స్వయంగా వచ్చి కాబోయే వధూవరులను దీవించడం తేజ సజ్జాకున్న నెట్ వర్క్, క్రేజ్ ఎలాంటిదో స్పష్టం చేస్తోంది.
Also Read
- Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
- Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
- Veeradhi Veerulu: మాస్ మహారాజా - శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
- Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
వీరితో పాటే పలువురు రాష్ట్ర మంత్రులు, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు, తోటి హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఒకవైపు టాలీవుడ్ గ్లామర్, మరోవైపు పొలిటికల్ పవర్.. ఈ రెండింటి కలయికతో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ ఒక సెన్సేషనల్ ఈవెంట్ గా మారిపోయింది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మౌర్యతో కలిసి జీవితంలో కొత్త అంకానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ అందమైన జంటకు జీవితాంతం ప్రేమ, సంతోషాలు దక్కాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా (#TejaSajjaEngagement) శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
-
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!