Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haindava Teaser: ఆధ్యాత్మికత, నమ్మకం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ల కలబోతతో రూపొందే మిస్టరీ థ్రిల్లర్లకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లూధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా భారీ ప్రాజెక్ట్ ‘హైందవ’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. రంగపురం దేవాలయంలో విగ్రహాల అదృశ్యం, వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. టీజర్ ప్రారంభమే రంగపురం ఆలయంలోని పది దైవ విగ్రహాలన్నీ ఒకేసారి మాయమైపోయాయనే కలకలంతో మొదలవుతుంది. ఓవైపు గుడిలో దేవుడి విగ్రహాలు కనిపించకుండా పోవడం.. మరోవైపు ఒక వ్యక్తి దారుణ హత్యకు గురై శవమై పడి ఉండటం తీవ్ర మిస్టరీగా మారుతుంది. “ఆ పది విగ్రహాలు ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉన్నాయి? అసలు ఆ విగ్రహాల లోపల దాగి ఉన్న రహస్యమేమిటి?” అన్న ప్రశ్నలు ఈ కథలో దాగి ఉన్న రహస్యాన్ని సూచిస్తున్నాయి.
ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కనిపించని దేవుడి కోసం కళ్లముందు ఉన్న మనుషులను హింసించడం అజ్ఞానమంటూ ప్రశ్నించే బలమైన ఆలోచనలు గల అధికారిగా ఆయన పాత్ర ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. తప్పు ఒప్పులను తేల్చడానికి మీ దేవుడు ఎవరు? చట్టమే తేలుస్తుందనే పదునైన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, “దుష్ట సంహారం కోసం గడప దాటిన నా దేవుళ్లు.. సరిగ్గా పవిత్ర పుష్కరాల వేళ తిరిగి గర్భగుడిలోకి అడుగుపెడతారు.. ఇది రాసిపెట్టిన విధి!” అంటూ నారాయణుడిపై అచంచల విశ్వాసంతో సాగే డైలాగులు కథలోని ఆధ్యాత్మిక గంభీరతను స్పష్టం చేస్తున్నాయి. శ్యామ్ సీఎస్ అందించిన పవర్ఫుల్ నేపథ్య సంగీతం టీజర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. “దేవుడికి జరగబోయేదంతా తెలిసినా ఆపడా..?” అన్న ప్రశ్నకు, “జరగబోయేది చెప్పి.. అది ఎలా జరుగుతుందో కళ్లారా చూపించేవాడే దేవుడు” అంటూ ముగింపులో వచ్చే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లోనే పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్తో వస్తున్న ‘హైందవ’ చిత్రంపై ఈ టీజర్ అంచనాలను పెంచేసింది.
Also Read
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..