కత్తి మహేష్ మృతిపై ఎంక్వయిరీ… పోలీసులకు ఏపీ గవర్నమెంట్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఏపీ పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే… కత్తి మహేష్ రెండు వారాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు అయినప్పటికీ, అతని డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. దీంతో దళిత నాయకుడు మంద కృష్ణ కూడా ఈ సందేహాలను లేవనెత్తుతూ మహేష్ మరణం వెనుక కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అంతేకాకుండా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు.
Read Also : కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
మంద కృష్ణతో పాటు, కత్తి మహేష్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ మరణం గురించి ఆసుపత్రి ముందుగా తమకు తెలియాలని, కానీ వారు అలా చేయకుండా నేరుగా వార్తలను మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాగా మంద కృష్ణ చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై పోలీసు విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగింది?, కత్తి మహేష్‌కు మాత్రమే ఎందుకు తీవ్ర గాయాలు అయ్యాయి? అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించారు. విచారణలో డ్రైవర్ తాను సీట్‌బెల్ట్ ధరించానని, కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ ధరించలేదని వెల్లడించినట్టు తెలిసింది. మరి రానురాను ఈ సమస్య ఏ మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!