కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్ 4న దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో స్టార్ నటీమణులు నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ సన్ పిక్చర్స్ నిర్మాణంలో “అన్నాత్తే” తెరకెక్కిస్తున్నారు. డి ఇమ్మాన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.

Read Also : థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?

కాగా రజని గత వారం యూఎస్‌లోని మాయో క్లినిక్‌లో విజయవంతంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని చెన్నైకి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల క్రితం తన “రజిని మక్కల్ మండ్రాం” సభ్యులతో కీలకమైన భేటీ జరిపారు. ఆ సమావేశం అనంతరం రజనీ భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని ప్రకటించిన విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-