Gopichand Viswam Teaser Released: ఇదేంటి ఇది పద్ధతి లేకుండా నీ యబ్బ అంటున్నారు అని ఆవేశ పడకండి.. ముందు టీజర్ మొత్తం చూసేసి ఆ తరువాత ఇది చదవండి.. ఆ చూసేశారు కదా.. ఈ సినిమా హిట్ అయితే.. దర్శకుడితో పాటు హీరో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ ఇద్దరు కూడా విశ్వం సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు వరుస ప్లాపుల్లో ఉన్నారు. గోపీచంద్ చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తుండగా.. శ్రీను వైట్ల కామెడీ పేలడం లేదు. దీంతో.. ఈసారి ఎలాగైనా సరే సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. అదంతా ఒక్క టీజర్‌లోనే చూపించారు. ఈ మధ్య టీజర్, ట్రైలర్‌కు సాలిడ్ రెస్పాన్స్ వస్తే.. సినిమాపై ఆటోమేటిక్ హైప్ పెరుగుతుంది. తాజాగా రిలీజ్ అయిన ‘విశ్వం’ టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేలానే ఉంది. ఈసారి శ్రీను వైట్ల కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉంది. ‘విశ్వం’ టీజర్‌ను కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కట్ చేశారు. గోపీచంద్ కామెడీ టైమింగ్, యాక్షన్ టీజర్‌లో హైలెట్‌గా ఉంది.
Nivetha Thomas: ‘అయ్యో నివేదా.. ఏమైంది నీకు?’.. ఇలా అయిపోయావు ఏంటి?
వింటేజ్ వైట్ల ఈజ్ బ్యాక్ అన్నట్టుగా టీజర్ అదిరింది. శ్రీను వైట్ల నుంచి ప్రేక్షకులు ఎలాంటి కామెడీని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో.. అవి ఈ టీజర్‌లో కనిపించాయి. నీ యబ్బ.. నీ యబ్బ.. మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా.. నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు..’ వంటి కామెడీ పంచ్‌లు బాగా పేలాయి. ఇక టీజర్ ఎండింగ్‌లో ‘వెంకీ’ మూవీ తరహా ట్రైన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందనేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈసారి వెన్నెల కిషోర్‌తో ట్రైన్ సీక్వెన్స్‌ను గట్టిగా రాసుకున్నట్టుగా ఉంది. గోపీచంద్ లుక్ కూడా బాగుంది. హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. మొత్తంగా రెండు నిమిషాల ‘విశ్వం’ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి విశ్వం ఎలా ఉంటుందో చూడాలి.