టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ అదే రేంజ్‌లో ధూసుకొతుంది. బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఇక ప్రజంట్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ‘ఓదేల 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్నా. 2022 లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ సిద్ధమైంది. ఇందులో తమన్నా శివశక్తిగా కనిపించనుంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్‌డెట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక్కసారిగా మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కానున్న నైపద్యంలో తమన్నా వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా మీడియాతో ముచ్చటించిన్న తమన్నా మూవీ గురించి అలాగే వ్యక్తిగత జీవితం పై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Prabhas : ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ అప్‌డెట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి..
ముందుగా ఓ విలేకరి .. ‘మీరు ఈ మంత్ర తంత్రాలను నమ్ముతారా?’ అని ప్రశ్నించగా.. ‘మంత్ర, తంత్రాలు నేను నమ్మను. ఒకవేళ అదే నిజమైతే మీ మీడియా పై ప్రయోగిస్తా. అప్పుడు అందరూ నా చేతుల్లో ఉంటారు. నేను చెప్పింది వింటారు. నేను ఏం చెబితే అదే రాసుకుంటారు’ అంటూ సరదాగా బదులిచ్చింది తమన్నా. అలాగే ఒంటరి జీవితం గురించి మాట్లాడుతూ.. ‘జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా దాని నుంచి బయట పడేందుకు ఎదుటి వ్యక్తులపై ఆధారపడాలనుకుంటాం. వారి నుంచి సలహాలు ఒక దైర్యం కావాలి అని కోరుకుంటాం. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్న ఆనందం లేదా బాధ మన చేతుల్లోనే ఉండాలి. దానికి ఎవరు కారణం కాకూడదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒంటరి వాడే. ప్రశ్న ఏదైనా లోతుగా ఆలోచిస్తే సమాధానం కచ్చితంగా దొరుకుతుంది. దాని కోసం ఎవరిని ఏం సలహా అడగాల్సిన పనిలేదు’ అని చెప్పుకొచ్చింది తమన్నా. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.