‘గాన్ గాళ్’ సినిమా ద్వారా ఫేమస్ అయిన అమెరికన్ నటి లీసా బేన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె వాషింగ్టన్ నగరంలో అదుపు తప్పి వచ్చిన ఒక ద్విచక్ర వాహనం కారణంగా తీవ్ర గాయాలపాలైంది. లీసా బేన్స్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఐసీయూలో చిక్సిత్స అందుకుంటోన్న ఆమె పరిస్థితి ఇంకా ఆందోళనకారంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
లీసా బేన్స్ వాషింగ్టన్ నగరంలోని లింకన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఒక ఎలక్ట్రిక్ బైక్ పై వచ్చిన వ్యక్తి ఆమె ఢీకొట్టాడు. అయితే, అతను అంతకు ముందు ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అతి వేగంగా వచ్చి లీసాను గాయపరిచిన దుండగుడు ఘటనా స్థలంలో ఆగకుండా వెళ్లిపోయాడు. అతడి గురించి గాలింపు చర్యలు సాగుతున్నాయని వాషింగ్టన్ పోలీసులు చెబుతున్నారు.