Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Box Office: సినిమాకు కావలసింది కేవలం వందల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు.. బలమైన కథ, అద్భుతమైన మేకింగ్ ఉంటే చాలని జపాన్ రాక్షసుడు మరోసారి నిరూపించాడు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా దాదాపు 210 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,800 కోట్లు) కళ్లు చెదిరే భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’కు అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద దిమ్మతిరిగే షాక్ తగిలింది. రామాయణ బడ్జెట్లో తొమ్మిదో వంతు.. అంటే కేవలం 19 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.160 కోట్లు) రూపొందిన జపనీస్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ‘రామాయణ’ను అలవోకగా వెనక్కి నెట్టేసింది.
నవంబర్ 6న థియేటర్లలోకి వచ్చిన ఈ జపనీస్ విజువల్ వండర్ ఉత్తర అమెరికా మార్కెట్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ట్రేడ్ వర్గాలకే దిమ్మతిరిగేలా చేసింది. ఫస్ట్ వీకెండ్లో (శుక్రవారం నుంచి ఆదివారం వరకు) ఈ చిత్రం అక్కడ ఏకంగా 31.6 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ కింగ్‌గా నిలిచింది. మరోవైపు విపరీతమైన ప్రచారంతో బరిలోకి దిగిన ‘రామాయణ’ వీకెండ్లో కేవలం 8.7 మిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌ను కలిపినా అక్కడ రామాయణ వసూళ్లు 12.2 మిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా చిన్న బడ్జెట్‌తో వచ్చిన గాడ్జిల్లాదే పైచేయిగా నిలిచింది. ఓపెనింగ్ వీకెండ్లో ‘గాడ్జిల్లా’ గ్లోబల్‌గా 63 మిలియన్ డాలర్లు రాబట్టగా, ‘రామాయణ’ నాలుగు రోజుల్లో సాధించిన మొత్తం వసూళ్లు 55 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.500 కోట్లు). ఇందులోనూ 30 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కేవలం భారత్ నుంచే రావడం గమనార్హం. అంటే విదేశీ గడ్డపై రణ్‌బీర్ చిత్రానికి జపాన్ రాక్షసుడు ఊహించని రీతిలో ముకుతాడు వేశాడని చర్చించుకుంటున్నారు.
Also Read
- DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
- Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
- Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
- Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: 'సీన్' మూవీపై మహేష్ బాబు రివ్యూ!
గతంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ సాధించిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’కు సీక్వెల్‌గా దర్శకుడు తకాషి యమజాకి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్‌కు చెందిన టోహో సంస్థ నిర్మించిన ఈ సినిమా 1949 నాటి చారిత్రక నేపథ్యంలో సాగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి విధ్వంసం నుంచి జపాన్ కోలుకుంటున్న తరుణంలో కింగ్ ఘిడోరా అనే భయంకర రాక్షస జీవి దేశంపై విరుచుకుపడటం, ఆ విపత్తును జపాన్ ప్రజలు, సైన్యం ఎలా ఎదుర్కొన్నారనే అంశాలను అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాలో కళ్లకు కట్టారు.
తాజావార్తలు
-
Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!