హాలీవుడ్ చరిత్రలోనే సూపర్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. తాజాగా 9వ భాగం విడుదలైంది. అయితే, ‘ఎఫ్ 9’గా పిలుస్తోన్న లెటెస్ట్ సీక్వెల్ ఇంకా ఇండియన్స్ కి అందుబాటులోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్స్ మూతపడటంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ లవ్వర్స్ ఊసూరుమనాల్సి వస్తోంది. అయితే, జూన్ 25న యూఎస్ లో రీలీజ్ కాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ సౌత్ కొరియాలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ కారణంగా బోలెడు పాజిటివ్ రివ్యూస్ పొందుతోంది. చాలా మంది ‘ఎఫ్ 9’ మార్వెలెస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అమెరికాలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక ఇండియాలో రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు. మన దగ్గర థియేటర్స్ తెరుచుకోవటాన్ని బట్టీ ఈ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ అందుబాటులోకి వస్తుంది. అంతలోగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫిల్మ్ మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. తమ సీరిస్ మొత్తంలోని ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్ని ఒక్క చోట చేర్చి ఈ టీజింగ్ ప్రమోని వదిలారు! నెటిజన్స్ యాజ్ యూజ్ వల్ గా ‘వావ్’ అంటున్నారు.