యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. గతంలో చాలాసార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్నడూ లేనంత బరువు తగ్గాడు.
Also Read : Dhandoraa : ‘దండోరా’ మూవీ నుంచి లవ్ సాంగ్ ‘పిల్లా..’ లిరికల్ వీడియో విడుదల
ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై అనేక అపోహలు వినిపించాయి. ఒకానొక దశలో అయితే ఎన్టీఆర్ – నీల్ కు మధ్య గొడవలు వచ్చాయని, సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అన్ని విమర్శలు చెక్ పెడుతూ డ్రాగన్ షూట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు నీల్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం దగ్గర ఉన్న ఒక ప్రధాన పోర్ట్ లొకేషన్ లో చిత్రబృందం ఇటీవల లొకేషన్ రెక్కీ చేసినట్టు సమాచారం. ఈ పోర్ట్ ప్రాంతంలో సినిమాలోని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరించే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొంత బ్రేక్ తీసుకుని కొన్ని సన్నివేశాలను రీ రైట్ చేశారు. కొంతమంది నటీనటులను కూడా ఛేంజెస్ చేశారు. నెగిటివ్ విమర్శలకు చెక్ పెడుతూ డబుల్ ఇంపాక్ట్‌తో భారీగా రెడీ చేస్తున్నారు.