టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. విఘ్నేశ్ గవిరెడ్డి హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సుమారు 10 నిమిషాల పాటు విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్‌పై గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఓ ప్రత్యేక టీమ్‌ని నియమించుకున్నారట. ఇందులో నేటి యువత అలవాట్లను ప్రతిబింబించే ఒక విజువల్ సాంగ్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read : OG : ‘ఓజీ’ నుంచి మరో సాంగ్ పై మేకర్స్ పోస్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్
కథ పరంగా ‘యుఫోరియా’ పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని టీమ్ చెబుతోంది. గుణశేఖర్ ఈసారి రాసిన స్క్రిప్ట్ కొత్తదనంతో నిండి ఉండబోతోందని, ఆయన దర్శకత్వంలో ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులు ఆస్వాదించగలరని అంటున్నారు. ముఖ్యంగా యువత తాలూకు భావోద్వేగాలను చాలా రియలిస్టిక్‌గా చూపించబోతున్నారట. అలాగే, సినిమా చివర్లో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఒక పాజిటివ్ మెసేజ్ కూడా ఉండనుందని సమాచారం. యూత్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా కంటెంట్‌ను మలిచారని తెలుస్తోంది. ఈ చిత్రంతో దాదాపు 20 మంది కొత్తవాళ్లు తెరపైకి పరిచయం కానున్నారు. కొత్త టాలెంట్‌కి అవకాశం ఇస్తూ, ఒక యూత్‌ఫుల్ అండ్ కలర్‌ఫుల్ సినిమాను అందించబోతున్న గుణశేఖర్‌పై ఇప్పుడు టాలీవుడ్ దృష్టి సారించింది.