టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. మంచి లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ త్రిల్లింగ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా క్రైమ్ సినిమాలే సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ మరో ఇమేజ్‌ను సంపాదించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ‘షో టైం’ అనే మరో క్రైమ్ మూవీతో రాబోతున్నారు. అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కిషోర్ గరికిపాటి నిర్మాతగా ,మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయింది.
Also Read : Thammudu : ‘తమ్ముడు’ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్..
నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ కనుక చూసుకుంటే చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఒక మర్డర్ చుట్టు అల్లుకున్న కథ అని ట్రయిలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రం థ్రిల్‌ను పంచడంతో పాటు ఆద్యంతం కామెడీతో అలరించబోతుందని అర్థం అవుతుంది. ఇక కోర్టు రూమ్ డ్రామా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్లు చూసే ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది.