ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయనుంది. దీంతో మరింత లేట్ కాకుండా అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు.
అందరికంటే ముందుగా రజినీకాంత్ ‘జైలర్ 2’ దసరా పై కర్చీఫ్ వేసింది. జూన్ లోనే రావాల్సిన ఈ సినిమా ఎవరొచ్చినా రాకపోయినా దసరాకు థియేటర్ లోకి వచ్చేస్తోంది. 20న పండుగ అయితే ఐదు రోజుల ముందే అక్టోబర్ 15 న ‘జైలర్ 2’ రిలీజ్ అవుతోంది. వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ మరొకసారి వాయిదా పడింది. ఆదర్శ కుటుంబాన్ని 2026 సమ్మర్ కి రిలీజ్ చేద్దాము అనుకుంటే షూటింగ్ పూర్తి కాలేదు. ఎట్టకేలకు అక్టోబర్ 2న రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అయితే దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారట. 20న దసరా పండుగ కావడంతో 18 రోజుల ముందే రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్ మారుస్తున్నారని తెలిసిందే. అక్టోబర్ 15న ‘జైలర్ 2’, 16న ‘రణబలి’ రిలీజ్ అవుతున్నాయి. దీంతో ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ వెతికే పనిలో పడింది. ‘జైలర్ 2’, ‘రణబలి’ వస్తున్న వీక్ కాకుండా వారం ముందే తొమ్మిదిన వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోంది.

