ఈ మధ్యకాలంలో సినిమా ఎంత హిట్ అవుతుందనే విషయం పక్కన పెడితే, పాటలు మాత్రం ఊపందుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలిచాక ప్రపంచమంతా టాలీవుడ్ వైపు దృష్టి పెడుతోంది. ఇటీవల ‘పుష్ప 2’ క్లైమాక్స్ వీడియో క్లిప్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ హ్యాండిల్ ట్విట్టర్ లో షేర్ చేస్తే, దానికి ఒక్క రోజులోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ‘భగవంత్ కేసరి’ మూవీలో మ్యాన్ హోల్ క్యాప్ అడ్డం పెట్టుకుని తుపాకీ బుల్లెట్ వర్షాన్ని బాలయ్య అడ్డుకునే ఫైట్ అక్కడ చాలా వైరలయ్యింది. ఇవే కాదు బాహుబలి, మగధీర, సాహు, హనుమాన్ లాంటివెన్నో ఇంగ్లీష్ జనాలకు రీచవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా తారక్ కూడా చేరిపోయాడు.
Also Read:Sai Pallavi: బోల్డ్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..!
హాలీవుడ్‌లో నాలుగుసార్లు గ్రామీ పురస్కారం దక్కించుకున్న విజేత ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్.. అతనితో పాటుగా ప్రముఖ బ్రిటిష్ గాయకులు ప్రస్తుతం ఇండియా పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో దేవర మూవీలోని చుట్టమల్లె పాటను పాడి అక్కడ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. షీరాన్ నోటి వెంట ఈ పాట వినడం తారక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. అంతే కాదు ఇందుకు సంబంధించిన వీడియోను జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్ స్టా స్టోరీ లో షేర్ చేసుకున్నాడు కూడా. ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగు సినిమా అంతర్జాతీయ సరిహద్దులు దాటినట్టు తెలుస్తోంది.