Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emraan Hashmi: ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ హెచ్1ఎన్1 (H1N1 – స్వైన్ ఫ్లూ) ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఇమ్రాన్ హష్మీ గత కొంతకాలంగా సినిమా షూటింగ్‌ల నిమిత్తం నిరంతరం ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల రాంచీలో జరిగిన షూటింగ్ ముగించుకుని ముంబైకి చేరుకున్న ఆయన.. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా H1N1 సోకినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య బృందం సూచించింది. వాస్తవానికి శనివారం నాడు బెంగళూరులో జరగాల్సిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్రాన్ హష్మీ పాల్గొనాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఆ ఈవెంట్‌ను వాయిదా వేశారు. ఈ మేరకు అభిమానులకు ఎదురైన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఇమ్రాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. త్వరలోనే కోలుకుని అభిమానులను కలుస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇమ్రాన్ హష్మీ ఇటీవల విడుదలైన ‘ఆవారాపన్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన 23 ఏళ్ల సినీ కెరీర్లో తొలిసారిగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ‘గన్‌మాస్టర్ జీ9’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఆదిత్య దత్ దర్శకత్వంలో జెనీలియా డిసౌజా, అపర్శక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇమ్రాన్ హష్మీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
Also Read
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!