Saroja Devi : పద్మభూషణ్ బి. సరోజా దేవి ఇకలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) ఇకలేరు. బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి మృతి వార్త చలనచిత్ర రంగానికి విషాదంలో ముంచింది.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బి. సరోజా దేవి,ఆమె నటనా ప్రతిభ, అభినయ నైపుణ్యం, చారిత్రక, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేశాయి. సౌందర్యానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ నటి, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ వంటి అనేక భాషల్లో సూపర్‌స్టార్ల సరసన నటించారు.
Also Read : Pooja Hegde : పూజా హెగ్డేకు బిగ్ ఛాన్స్ – టాలీవుడ్‌లో గ్రాండ్ రీ ఎంట్రీ ఖాయం
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
కాగా తెలుగులో బి. సరోజాదేవి, ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, కాంతారావు, కృష్ణ వంటి దిగ్గజులతో కలిసి పనిచేశారు. ఇంటికి దీపం ఇల్లాలే,మంచి చెడు,దాగుడు మూతలు,పండంటి కాపురం,దాన వీర శూర కర్ణ,,అల్లుడు దిద్దిన కాపురం.. వంటి సినిమాల్లో ఆమె పాత్రలు మహిళా బలాన్ని, కుటుంబ విలువలను, భర్త పట్ల నిబద్ధతను ప్రతిబింబించేలా రూపొందాయి. ఆమె నటన ద్వారా ప్రేక్షకులు సహజత్వాన్ని, గొప్ప భావోద్వేగాన్ని అనుభవించారు.
బి. సరోజాదేవి సినీరంగానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది. అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళ్, కన్నడ, తెలుగు చలనచిత్ర పరిశ్రమల నుంచి ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బి. సరోజాదేవి వెండితెరపై చూపించిన విలక్షణమైన నటన, శీలవంతమైన ప్రవర్తన, విలువలతో కూడిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. బి. సరోజాదేవి మిగిల్చిన కళా వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!