దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు.
Dulquer Salman: ‘సీతారామం’ షూటింగ్ పూర్తి!

Moviee