మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి, ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు దుల్కర్. హీరోగా పలు తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సింగర్ గా కూడా అవతారమెత్తాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘హే సినామిక’. ఈ చిత్రంలో దుల్కర్ ఓ సాంగ్ ను ఆలపించారు. దుల్కర్ సల్మాన్ కు సింగిగ్ ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే చాలామంది హీరోలు సింగర్స్ మారి తమ టాలెంట్ ను బయటపెట్టారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కొరియోగ్రాఫర్ బృంద ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతోంది. ఈ తమిళ చిత్రం షూటింగ్ డిసెంబర్ 26న ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘హే సినామిక’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.