I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I’m Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల వేళ తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ షోలు థియేటర్లలో ఆలస్యమవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తొలి ఆటలు సమయానికి పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై చిత్ర యూనిట్ వెంటనే స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు డిజిటల్ కంటెంట్ డెలివరీలో అనూహ్యంగా ఎదురైన సాంకేతిక అడ్డంకుల వల్లే ప్రదర్శనలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు మలయాళ కంటెంట్ ఇప్పటికే విజయవంతంగా చేరింది. దీంతో మలయాళ షోలన్నీ ముందస్తు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయి.
సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని, కొద్దిపాటి జాప్యం తర్వాత తెలుగు షోలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని నిర్మాతలు స్పష్టం చేశారు. టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లకు తరలివచ్చిన సినీ ప్రియులకు కలిగిన ఈ అసౌకర్యానికి చిత్ర బృందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సాంకేతిక సమస్య కొలిక్కి రాగానే తెలుగు ప్రదర్శనలు మొదలుకానున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన కయాదు లోహార్, సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియాస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల దుల్కర్ సల్మాన్, సంయుక్త విశ్వనాథన్ హాజరు కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్లో నిర్వహించారు.
Also Read
తాజావార్తలు
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..