NTV Telugu Site icon

Robinhood: #Grok ముహూర్తం కలిసి రాలేదు.. రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ వాయిదా!

Robinhood Teaser

Robinhood Teaser

నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ విడుదలలో ఊహించని ఆటంకం ఎదురైంది. మొదట మార్చి 21, 2025 సాయంత్రం 4:05 గంటలకు థియేటర్‌లో ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ జరపాలని ట్విట్టర్ ఏఐ గ్రోక్ పెట్టిన ఒక ముహూర్తానికి షెడ్యూల్ చేసినప్పటికీ, థియేటర్లో ఈవెంట్ కోసం అనుమతులు రాకపోవడంతో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ ఈవెంట్ ను బాలానగర్ మైత్రీ విమల్ థియేటర్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం, రాబిన్‌హుడ్ ట్రైలర్ ఇప్పుడు మార్చి 23, 2025న జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో విడుదల కానుంది.

Nithin : అది నాకు తెలియకుండా జరిగింది.. కాంట్రవర్సీపై నితిన్..

ఈ మార్పుపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముట్టంశెట్టి మీడియా బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం, మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా, వెంకీ కుదుముల ట్రేడ్‌మార్క్ హాస్యంతో పాటు ఉత్కంఠభరిత యాక్షన్‌ను అందించనుందని అంచనా. ట్రైలర్ వాయిదా పడినప్పటికీ, అభిమానుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వాయిదా సమాచారాన్ని కూడా నితిన్, వెంకీ ఇద్దరూ గ్రోక్ తో సరదాగానే వీడియో చేసి రిలీజ్ చేయడం గమనార్హం.