సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడు,ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన స్వీయ దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య” సినిమాతో కుమారుడు అద్వాయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల మరియు శ్రీమతి రామలక్ష్మి సమర్పణలో ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
Also Read : MrBachchan : మిస్టర్ బచ్చన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే..?
వినాయక చతుర్థి సందర్భంగా ‘సుబ్రహ్మణ్య’ నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడ సూపర్ స్టార్ డా. శివ రాజ్‌కుమార్ ఆవిష్కరించిన పోస్టర్‌లో అద్వాయ్‌ని టైటిల్ రోల్‌లో సుబ్రహ్మణ్యగా పరిచయం చేశారు. పొడవాటి జుట్టు మరియు గడ్డంతో, అద్వే ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులలో పోస్టర్‌లో పవర్ఫుల్, గంభీరంగా కనిపిస్తున్నాడు. చురుకైన కళ్లలో చూస్తూ అడవిలో ఒక రహస్య ప్రదేశం యొక్క ప్రవేశద్వారం వద్ద గూండాలు అతనిని తరుముతున్నట్టు ఉండే ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Raed : SDT18 : సుప్రీం హీరో సరసన తమిళ భామ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
ఇప్పటికే 60% ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ముంబైలోని రెడ్ చిల్లీస్ స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నైలోని ప్రముఖ స్టూడియోలలో VFX మరియు CGI పనులు కూడా చక చక జరుగుతున్నాయి. KGF మరియు సలార్‌లకు సంగీతం అందించిన రవి బస్రూర్ సుబ్రమణ్య కు సంగీతం అందిస్తున్నాడు. సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీలో పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విఘ్నేష్ రాజ్.