డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా వినూత్నమైన డాక్టర్ కేర్-కోవిడ్ కేర్ కార్యక్రమాన్ని బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి మంగళవారం జూబ్లిహిల్స్ లోని హోటల్ దస్పల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోమియోపతి మందుల ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందకు డాక్టర్ కేర్ కోవిడ్ కేర్ ను సేవను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయంమని ఆమె అన్నారు.
హోమియోపతి మందులు అన్ని రకాల వైరస్ జబ్బులను ఎదుర్కొనే టటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయని, శరీరంలో ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధకశక్తి)నీ పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చని, ఇందుకు కోసం భారత్ ఆయుష్ విభాగం ప్రివెంటివ్ మందులను కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
డాక్టర్ హోమియోపతి యం.డి డాక్టర్ ఏ.యం. రెడ్డి మాట్లాడతూ ఈ కోవిడ్ సేవలో ప్రివెంటివ్, క్యూరిటీవ్, పోస్ట్ కోవిడ్ కేర్ సేవలను ప్రవేశపెట్టామని, ఇందులో పోస్ట్ కోవిడ్ లో 90 రోజుల కోర్సు ఉంటుందని, దీని ద్వారా కోవిడ్ ద్వారా వచ్చే దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. ఇక క్యూరిటీవ్ లో ఆన్ లైన్ ద్వారా డాక్టర్లు కోవిడ్ రోగులతో అందుబాటులో ఉంటారని, 21 రోజుల కోర్సులు లో మందులను అందిస్తున్నామని వివరించారు.
ఇక భారత్ ఆయుష్ విభాగం సూచించిన మేరకు కరోనా బారిన ఎవరైతే పడలేదో వారికి ఆయుష్ విభాగం సూచించిన అర్సెనికం ఆల్బమ్ -30 తో పాటు టులర్ కులినమ్ -19 అనే మందు చాలా చక్కగా ప్రివెంటివ్ మందుగా పనిచేస్తుందని వీటిని, డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ లలో వారం రోజుల పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని దీని కోసం 10 లక్షల డోసులను అన్ని బ్రాంచ్ లలో తమ వైద్యులు మే 1 నుండి 7 వ తేదీ వరకు ఉచితంగా అందిస్తున్నామని, ఈ మందుల కోసం 7675008000ను సంప్రదిమచవచ్చని కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్ధ సిఇఓ పి.సృజన, డాక్టర్ సారికా, దైవాజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.