లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీ లోకయనకుడు కమల్ హాసన్ ని బౌన్స్ బ్యాక్ చేసింది. ఈ మూవీతో కమల్ కోలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాడు. సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఇంటర్వెల్ ఫైట్ లో కమల్ మాస్క్ తీసేసి చేసే ఫైట్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. ఫాహద్ ఘోస్ట్ గురించి కథలు కథలుగా విన్నాం అని చెప్పిన టైమ్ లో కమల్ హాసన్ మాస్క్ తీయగానే ఆడియన్స్ థియేటర్ లో హంగామా చేశారు. ఈ యాక్షన్ బ్లాక్ ని లోకేష్ కనగరాజ్ మోకో బోట్ కెమెరా వాడి షూట్ చేసాడు. బీస్ట్, తునివు సినిమాలకి కూడా ఈ కెమెరాని వాడారు. హై స్పీడ్ విజువల్స్ ని క్యాప్చర్ చెయ్యడంలో మోకోబోట్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది.
ఆడియన్స్ కి ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఈ మోకోబోట్ కెమెరాని ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ సినిమా కోసం వాడుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ ని గ్రాండ్ స్కేల్ లో షూట్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం శంకర్ మోకోబోట్ కెమెరాని వాడుతున్నాడు. రెండు సినిమాల అనుభవం ఉన్న లోకేష్ కనగరాజ్ మోకోబోట్ కెమెరాని ఆ రెంజులో వాడితే, ఇక తమిళ సినిమా స్థాయినే పెంచిన శంకర్ ఏ రేంజులో వాడుతాడో అర్ధం చేసుకోవచ్చు. రామ్ చరణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చే సమ్మర్ కి రిలీజ్ చెయ్యడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.