‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చూసి సుకుమార్ ఫోన్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ : దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Lakshman Karya Interview for Maruthi Nagar Subramanyam Movie: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది. . రావు రమేష్ హీరోగా ఈ సినిమాను లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కించారు. వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ కార్య మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం
తొలి సినిమాకు, రెండో సినిమాకు గ్యాప్ వచ్చింది?
‘హ్యాపీ వెడ్డింగ్’లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఈ సారి తప్పు జరగకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ముందు కథ, హీరో క్యారెక్టర్ రాసుకున్నా. అయితే, కరోనా రావడంతో అనుకోకుండా రెండేళ్లు ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేశాం.
Also Read
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
- Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
రావు రమేష్ గారిని దృష్టిలో పెట్టుకుని కథ రాశారా?
ముందు కథ రాశాను. ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించిన తర్వాత రావు రమేష్ గారు గుర్తుకు వచ్చారు. అప్పటికి ‘కెజిఎఫ్’, ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా హిట్స్, ‘ధమాకా’ చేసి ఉన్నారు. ఆయన సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన చేయరేమో అని చాలా మంది చెప్పారు. ఒక్క మీటింగ్ కోసం వెయిట్ చేశా. ఫస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత నవ్వేశారు. 15, 20 నిమిషాల్లో కథ వివరించా. ఓకే చేశారు.
సుకుమార్ వైఫ్ తబిత గారు సినిమాను ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటి?
నా వైఫ్, తబిత గారికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లిద్దరికీ పరిచయం ఉంది. కానీ, నేను సినిమాలు చేస్తానని తబిత గారికి తెలియదు. సినిమా అంతా అయ్యాక ఓసారి చెప్పమని నా భార్యను అడిగా. తను చెప్పింది. అప్పుడు తబిత గారు, సుకుమార్ గారు పిలిచి మాట్లాడారు. ప్రజల్లోకి వెళ్లేలా ప్రమోషన్ చేయమని చెప్పారు. రావు రమేష్ గారికి ‘కెజిఎఫ్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ గెటప్స్ వేసి వీడియో చేశాం. ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేయించాం. సాంగ్స్ కూడా విడుదల చేశాం. ఓ రోజు సుకుమార్ గారే తబిత గారితో సాంగ్ విడుదలైందని, అది బావుందని చెప్పారట. అప్పట్నుంచి ఆవిడ అప్డేట్స్ అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ‘నువ్వు ఏమైనా చేయాలని అనుకుంటే 100 పర్సెంట్ చెయ్’ అని చెప్పడంతో సినిమా చూస్తానని అన్నారు.
సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్. సో, తబిత గారికి భయపడుతూ ప్రివ్యూ వేశా. నేను డోర్ బయట ఉన్నాను. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు ముందు నన్ను చిన్న సినిమా చిన్న సినిమా మోసం చేశావు, ఇంత బాగా చేశావు, సినిమా బావుందని మెచ్చుకున్నారు.
‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ను మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది కదా! వాళ్లకు సినిమా చూపించారా?
తబిత గారితో మైత్రి శశి గారు వచ్చారు. ఆయనకు సినిమా నచ్చింది. ఆ తర్వాత నవీన్ ఎర్నేని గారికి, రవిశంకర్ గారికి సినిమా చూపిద్దామని చెప్పారు. వాళ్లకూ నచ్చింది. డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పారు.
సుకుమార్ గారు ఇంకా సినిమా చూడలేదా?
తబిత గారికి ప్రివ్యూ వేసినప్పుడు సుకుమార్ గారికి రావడం కుదరలేదు. అప్పుడే హార్డ్ డిస్క్ సుకుమార్ గారి ఇంటికి పంపించాను. ఖాళీగా ఉన్న సమయంలో చూడమని! ఆయనకు జ్వరం రావడంతో ఓ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఆ రోజు పదకొండు గంటలకు తబిత గారు ఫోన్ చేశారు. ఇవాళ సుకుమార్ గారు సినిమా చూస్తారని! అప్పట్నుంచి ఆయన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల రేడియస్ లో తిరగడం మొదలు పెట్టా. రెండున్నర సమయంలో ఫోన్ వచ్చింది. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?