రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మిస్తున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. అయితే.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా అకీరా, ఖుషి-2 గురించి ప్రస్తావించాడు.
READ MORE: Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..
అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా? అనే ప్రశ్నకు ఎస్ జే సూర్య సమాధానమిచ్చాడు. తనకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉందని వెల్లడించాడు. “ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకీరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారెలాగానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అది జరుగుతుందేమో చూడాలి.” అని సూర్య వ్యాఖ్యానించాడు.
READ MORE: Nara Lokesh: రేపు పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఇదిలా ఉండగా..తాజాగా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన రేణు దేశాయ్… అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నానని అన్నారు. ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడ చూడలేదని ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదని సంతోషం వెలిబుచ్చారు.