Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రేపు (మే 18న) ముంబైలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముందే చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా బడ్జెట్.. బాలీవుడ్ మార్కెట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో గ్లోబల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న, రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కావడంతో ‘పెద్ది’ సినిమాపై నార్త్ బెల్ట్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటిపోయిందంటూ గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ దర్శకుడు బుచ్చిబాబు సినిమా బిజినెస్ అండ్ నార్త్ మార్కెట్‌పై సాలిడ్ క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
- Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
- DRAGON : ఎన్టీఆర్ - నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
- MEGA 158 : 'బాబీ - చిరు' సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ఆయన మాట్లాడుతూ..”సినిమా బడ్జెట్ అంతా పక్కా ప్లానింగ్‌తో కంట్రోల్లోనే ఉంది. ఎక్కడా హద్దులు దాటలేదు. ఇక కథ విషయానికి వస్తే.. ఈ సినిమా హిందీ వాళ్లకు చాలా బాగా నచ్చుతుంది. నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషన్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా బాలీవుడ్లో ‘పెద్ది’ చాలా పెద్ద రేంజ్లో ఆడుతుంది’’ అని తెలిపాడు. ఒక స్వచ్ఛమైన గ్రామీణ క్రీడ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా కావడం, పైగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండటం వల్ల ఈ సినిమాకు నార్త్ మార్కెట్లో అడ్వాంటేజ్ లభిస్తుందని బుచ్చిబాబు నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..